ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి

13 Nov, 2016 00:04 IST|Sakshi
అంతర్వేది (సఖినేటిపల్లి) : 
దేవాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించి, వారి అభ్యున్నతికి పాటుపడతానని నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని దేవాంగ సంక్షేమ సంఘం అడహాక్‌ కమిటీ రాష్ట్ర సభ్యుడు టి.శ్రీనివాస విశ్వనాథ్‌ పేర్కొన్నారు. అప్పటి అఖిల భారత దేవాంగ సభలో ఇచ్చిన మాటను చంద్రబాబు తప్పారని విమర్శించారు. శనివారం అంతర్వేదిలో దేవాంగ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత జాతీయ వారసత్వ సంపదని, దీని పరిరక్షణకు అమరావతిలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.  కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతా శంకరమూర్తిని, వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను సత్కరించారు. సంఘ అధ్యక్షుడు కె.ప్రసాద్‌రాజు అధ్యక్షత వహించారు. మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు, ఇంద్రజాల కళాకారుడు శ్యాం జాదూగర్, ఉద్యోగ సంఘ గౌరవాధ్యక్షుడు జాన వీరభద్రశర్మ, ప్రధాన కార్యదర్శి పి.ప్రసాదరాజు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు