పెడ‌దోవ‌కు కేరాఫ్ హైవే

26 Jun, 2017 23:27 IST|Sakshi
పెడ‌దోవ‌కు కేరాఫ్ హైవే
రాజానగరం : ఇంతవరకు వాహాన ప్రమాదాలకే తావిస్తున్న జాతీయ రహదారి, వాటితోపాటు సుఖ వ్యాధులు వ్యాప్తికి కూడా కారణమవుతుంది. మొన్నటి వరకు ఈ రహదారి వెంబడి ఉన్న పలు కాకా హోటళ్లే అడ్డాగా సాగిన అసాంఘీక కార్యకలాపాలు ఇప్పుడు చెట్టు పుట్ట అనే తేడా లేకుండా, పగలు, రాత్రి అనే సమయంతో నిమిత్తం లేకుండా యధేచ్చగా జరిగిపోతున్నాయి. దీనితో అభం, శుభం తెలియని కుర్రకారు వీటి ఆకర్షణకు లోనై ఎయిడ్స్‌ వంటి ప్రమాదకరమైన సుఖవ్యాధులను అంటించుకుని మొగ్గ దశలోనే జీవితాలను బలిచేసుకుంటున్నారు. వీటిని నిరోధించవలసిన పోలీసులు పరిధి, వారధి అంటూ మడికట్టుకుని కూర్చుంటే అవకాశవాదులు బ్రోతల్స్‌తో చేతులు కలిపి అంకిన కాడికి విఠులను దోచుకుంటున్నారనే ఆరోపణలకు కూడా వినిపిస్తున్నాయి.
జిల్లాలో తుని నుండి రావులపాలెం వరకు సుమారు 130 కిమీ పొడవున 16వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి ఉంది. ఈ రహదారిలో రావులపాలెం నుండి వేమగిరి వరకు కూరగాయల తోటలు, పూల నర్సరీలు ఉంటే, వేమగిరి నుండి తుని వరకు మామిడి, జీడిమామిడి తోటలుతోపాటు పుంకానుపుంకాలుగా వేసిన లేఅవుట్లు ఉన్నాయి. దివాన్‌చెరువు, లాలాచెరువులో 1500 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు కూడా ఉంది. ఏ ప్రాంతంలో ఏమున్నాగాని వాటినే అడ్డాగా చేసుకుని   అసాంఘీక కార్యకలాపాలకు నిర్భయంగా సాగిస్తున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం నుండి రాజానగరం వరకు ఆదికవి నన్నయ యూనివర్సిటీతోపాటు ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ఎక్కువగా ఉండటంతో తెలిసీ తెలియని వయస్సులో యవ్వన దశలో ఉన్న యువత వీటికి ఆకర్సితులై నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు.
టార్చిలైట్స్‌తో సిగ్నల్స్‌
జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న తోటలు, లేఅవుట్లలో పెరిగిన తుప్పలు అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా తయారువుతున్నాయి. లాలాచెరువులోని పుష్కర వనం ప్రాంతంతోపాటు దివాన్‌చెరువు నుండి గైట్‌ కళాశాల వరకు ఉన్న రిజిర్వు ఫారెస్టు, నన్నయ యూనివర్సిటీ సమీపంలోని ఆర్‌కె టైన్‌ షిప్, జెకె గార్డన్స్, పగటి సమయంలో కూడా అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఈ ప్రాంతాలతోపాటు రహదారి పొడవునా రాత్రి సమయాలలో విటులను టార్జిలైట్స్‌ వేసి మరీ ఆకర్షిస్తున్నా నిఘా వ్యవస్త నిశ్చేతనంగా చూస్తుంది. దారి పొడవునా ఉన్న తోటులు, తుప్పల నుండి టార్చ్‌ లైట్‌ సిగ్నల్స్‌ వస్తే చాలు అటుగా పోయే విటులు తమ వాహనాలను సైతం రోడ్డు ప్రక్కన పార్కు చేసి లైట్‌ సిగ్నల్స్‌ వచ్చిన వైపు వెళ్లి, కోరిక తీర్చుకుని వస్తున్నారు. ఈ సమయంలో వారికి అంటుకునే రోగాల గురించి, తమనే నమ్ముకున్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం లేదు. అయితే  ఏ అవకాశం లేని వారు ఈ రొంపిలోకి వస్తారని, కుటుంబ పరిస్తితులే వారిని ఈ విధంగా మారుస్థాయని బ్రోతల్స్‌ పట్ల జాలి చూపించే వ్యక్తులు వారి ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత గురించి కూడా ఆలోచించాలి.
ఇదో రకమైన దోపీడీ ..
జాతీయ రహదారి వెంబడి పెరిగిపోతున్న అసాంఘీక కార్యకలాపాలను నియంత్రించవలసిన పోలీసు వ్యవస్త ఈ విషయంలో పూర్తిగా నిర్వీర్యమైందనే చెప్పవచ్చు. తమ పై బాస్‌లు కూడా ఈ విషయమై పెద్దగా సీరియస్‌నెస్‌ చూపకపోవడంతో కొంతమంది పోలీసు కానిస్టేబుల్స్‌ బ్రోతల్స్‌ సాయంతో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కాలేజ్‌ విద్యార్థులు ఇటీవల కాలంలో ఎక్కువగా వీరి ఆకర్షణకు లోనవుతున్నారు. అటువంటి వారిలో బాగా రిచ్‌గా కనిపించిన వారు ఎవరైనా ఉంటే బ్రోతల్స్‌ ఫోన్‌ ద్వారా తనకు టచ్‌లో ఉండే కానిస్టేబుల్‌కి వర్తమానం పంపడం, ఆ పై అతను వేగిరమే అక్కడకు చేరుకుని ఇరువురిని చెడామడా తిట్టి, పోలీసు స్టేషనుకు రమ్మంటూ బెదిరించడం, దానితో ఆ యువకుడు భయపడిపోయి, తన వద్ద ఉన్నదంతా నిలువుదోపిడీగా అతని చెల్లించుకోవడం ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఇదే విషయాన్ని కొంతమంది పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినాగాని ఎటువంటి ప్రయోజనం లేదు, సరికదా వారి వివరాలు ఇస్తే యాక్షన్‌ తీసుకుంటామనడం కొసమెరుపు.
ఉపాధి చూపితే ఈ పని మానేస్తాం
ఈ పని చేయడానికి మాకు కూడా రోతగానే ఉంది. కాని ఏం చేస్తాం, మా జీవితాలతోపాటు మరికొందరి జీవితాలను కూడా మేమే పోషించాలి. గత్యంతరం లేని స్థితిలో ఈ పనిచేస్తున్నాం. ప్రభుత్వం మాలాంటోళ్లకు సరైన ఉపాధి చూపితే ఈ పని మానేసి, హాయిగా సంసార పక్షంగా బ్రతుకుగడపాలను కుంటున్నాం. కాని మాకు ఉపాధి ఎవరు చూపుతారు, నాయకులు మాటలు చెప్పడమేగాని ఆచరణలో కనిపించడం లేదు.
- పేరు వద్దని ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను వివరించింది.
మరిన్ని వార్తలు