క్రైస్తవులకు రక్షణ కల్పించాలి

16 Dec, 2016 23:24 IST|Sakshi
క్రైస్తవులకు రక్షణ కల్పించాలి
- బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి దాడులు అధికం
 – ఆలిండియా ట్రూ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు
 
కర్నూలు(న్యూసిటీ):  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  క్రైస్తవులు, చర్చీలపై దాడులు అధికమయ్యాయని ఆలిండియా ట్రూ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు, బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్‌ డైరక్టర్‌ పీడీ సుందరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేసూ​‍్త శుక్రవారం కర్నూలు నగరంలోని ఎ‹స్‌టీబీసీ కళాశాల నుంచి  పెద్దపార్క్, రాజ్‌విహార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ సుందరరావు మాట్లాడుతూ  క్రైస్తవ దళితులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. అలాగే క్రైస్తవులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి వేధించడం మానుకోవాలని, బలవంతంగా మతమార్పిడి చేయరాదని డిమాండ్‌ చేశారు.  మహిళా పోలీసు స్టేషన్‌ దగ్గర ఏబీఎం స్థలంలో స్టాంటన్‌దొర విగ్రహం పెట్టాలని,  ఆ సర్కిల్‌ను స్టాంటన్‌ సర్కిల్‌గా ప్రకటించాలని కోరారు.    ర్యాలీలో ఆలిండియా ట్రూ క్రిష్టియన్‌ కౌన్సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు దేవపాల్, బాబురావు, జాన్‌సన్‌ విక్టర్, రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్ర, సంతోష్, రాజేంద్రబాబు, సీబీటీ ప్రిన్సిపాల్స్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు