-

గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నా

27 Mar, 2017 23:55 IST|Sakshi
 కర్నూలు(న్యూసిటీ): రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఉరుకుందరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరప, శనగ, పప్పు ధాన్యాలకు గత ఏడాది క్వింటాల్‌ ధర రూ.14 వేలు ఉండగా ఈ ఏడాది రూ.6 వేల నుండి రూ.7 వేలు ధర పలుకుతోందన్నారు. గత ఏడాది పప్పుశనగ క్వింటాలు రూ.7500 నుండి రూ.12 వేలు పలికిందని, ఈ ఏడాది వ్యాపారులు కుమ్మక్కై రూ.5 వేలకు కొంటున్నారని ఆరోపించారు. ధర్నాలో నాయకులు శివశంకర్, అంపమ్మ, శాంతమ్మ, ఆర్‌.కృష్ణారెడ్డి, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు