బాలికపై గ్యాంగ్‌రేప్.. సజీవ దహనం

29 Jan, 2016 08:09 IST|Sakshi
బాలికపై గ్యాంగ్‌రేప్.. సజీవ దహనం

నిందితులపై రేప్, హత్య, ‘నిర్భయ’ కేసు నమోదు

పరకాల: బతుకుదెరువు కోసం వచ్చిన బాలిక కామాంధుల చేతిలో బలైపోయింది. కామాంధులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన అనంతరం హత్య చేసి మృతదేహంపై డీజిల్ పోసి దహనం చేశారు. వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లిలో బుధవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఇరుగుదిండ్ల కృష్ణవేణి(17)ది ముమ్మాటికి హత్యేనని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కి చెందిన ఇరుగుదిండ్ల వెంకటేశ్ కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాది క్రితం పరకాల మండలం నర్సక్కపల్లికి వచ్చారు. ఓ ఇంట్లో అద్దెకు ఉం టూ క్రేన్ సహాయంతో బావుల పూడికతీత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అతని పెద్ద కూతురు కృష్ణవేణి కూడా తండ్రి వెంట పనికి వెళ్తోం ది. అదే గ్రామానికి చెందిన వేముల రాజుతో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది. డబ్బులు బ్యాంకులో వేయడం కోసం అప్పుడప్పుడు పరకాలకు వచ్చే కృష్ణవేణిని రాజు కలిసేవాడు. ఈ నెల 26న తండ్రి వెంకటేశ్‌కు ఛాతీలో నొప్పిరావడంతో వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఇంట్లో ఉన్న  కృష్ణవేణి వద్దకు బుధవారం మధ్యాహ్నం వేముల రాజు వచ్చాడు. అతని వెంట స్నేహితులైన కందికొండ కార్తీక్, బండి శ్రావణ్, గట్టు సాయిలు కూడా ఉన్నారు.

కృష్ణవేణిపై వారంతా సామూహికంగా లైంగిక దాడికి పాల్పడా రు. ఈ విషయం బయటకు రాకుండా ఉండడం కోసం హత్యచేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి తలుపులు వేసి పరారయ్యారు. బుధవారం పరకాల డీఎస్పీ సంజీవరావు, సీఐ మల్లయ్య ఈ ఘాతుకంపై విచారణ చేపట్టగా విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కాగా, తన కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని, ఆమెపై  అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు దుర్మార్గులను ఉరితీయాలని కృష్ణవేణి తండ్రి వెంకటేశ్ పోలీసులను కోరారు.

అయితే, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో తమకు న్యాయం జరిగే అవకాశం కన్పించడం లేదని ఆవేదన చెందాడు. మృతురాలు తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సక్కపల్లి గ్రామానికి చెందిన వేముల రాజు, కందికొండ కార్తీక్, బండి శ్రవణ్, గట్టు సాయిలపై రేప్, హత్య, నిర్భయ కేసులను నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా