హర్తాళ్‌కు పోలీసు సంకెళ్లు

29 Nov, 2016 01:46 IST|Sakshi
హర్తాళ్‌కు పోలీసు సంకెళ్లు

నిరసనకారుల్ని ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు
సామాన్యుల కష్టాలకు ప్రభుత్వాలు
సమాధానం చెప్పాలన్న అఖిలపక్ష నాయకులు
 

చిత్తూరు(కార్పొరేషన్):
పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల పడుతున్న అవస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నోట్ల ఇబ్బందులను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ.. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు. అయితే   ముందస్తుగా పోలీసులు నాయకులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకొని సాయంత్రం స్టేషన్ నుంచి బయటకు పంపా రు. అయితే విద్యాసంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటిం చడం, వ్యాపారులు కూడా పలుచోట్ల దుకాణాలు మూసివేయడంలో ప్రజలు రోడ్లపై పెద్దగా కనిపించలేదు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఉదయం నుంచే..
ఉదయం ఆరు గంటల నుంచే ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు పహారా కాశారు. అదేవిధంగా రద్దీకూడళ్లలోనూ భారీగా బలగాలను మోహరించారు. దీంతో అక్కడి వచ్చిన నాయకులను అప్పటికప్పుడే అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లెశ్రీనివాసులు పిలుపు మేరకు నగరయూత్ అధ్యక్షుడు నారాయణ, నాయకులు టి.వి.శ్రీనివాసులు, పూంగొడి ఆధ్వర్యంలో గాంధీవిగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక శేషాపిరాన్‌వీధి నుంచి సీపీఐ, సీపీఎం నాయకులు నాగరాజన్, సురేంద్ర రమాదేవి, జమిలాభి, రాజేంద్ర, విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు ర్యాలీ తీశారు.

అరుుతే వీరు గాంధీవిగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని మార్కెట్‌వద్ద అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. కుదరకపోవడంతో చర్చివీధిలో అదుపులో తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారి అరెస్టుల పర్వం సాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, మనోహర్, ఢిల్లీప్, హరి, శరవణ, సేతు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రూరల్ మండలంలో..
చిత్తూరు(రూరల్): పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని, అరుునా కేంద్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం అనంతాపురం రోడ్డులో నరసన చేపట్టారు. ఉదయం 6 గంటలకే బంద్ పాటించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు రోడ్డుపై కిలో మీటరు మేర నిలిచిపోయారుు. ఇంతలో స్థానిక బీఎన్‌ఆర్‌పేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ  నోట్ల రద్దుతో రోజురోజుకూ చిల్లర కష్టాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. రోజు కూలీలు, రైతు కుంటుంబాల జీవనం కష్టతరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సామన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.  ధర్నాలో ఆ పార్టీ నాయకులు రాజా, త్యాగరాజులు, దిలీప్, రంజన్, ప్రభాకర్, రాబర్ట్, గంగ, కుమార్, శేఖర్, కన్నన్, గోవిందస్వామి, రజనీ, కళిల్, గంగాధరం, పార్లిన్, షణ్ముగం, భాస్కర్, భూప, చల్లా, వినాయకం, తులసీరాం, గోపీ, దేవదాసు, ముత్తు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు