సర్కార్ వైద్యానికి కార్పొరేట్ సొబగులు

17 Mar, 2016 03:18 IST|Sakshi

సిద్దిపేటలో రూ. 1.25 కోట్లతో ఐసీయూ యూనిట్
నేడు మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభం

 సిద్దిపేట జోన్ : సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి సొబగులను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే కంగారు మెథడ్ యూనిట్ ద్వారా గుర్తింపు పొందిన సిద్దిపేట పట్టణం వైద్యసేవల్లో మరో అడుగు వేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు నోచుకొని అత్యాధునికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. రూ.  1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్రవైద్య, ఆరోగ్య శాఖమంత్రి లకా్ష్మరెడ్డి, నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావుతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసీయూ యూనిట్ ద్వారా సిద్దిపేట  ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలను అందించడానికి రాష్ర్ట ప్రభుత్వం 10 మందితో కూడిన వైద్య బృందం ఏర్పాటు చేసింది. వీటికి అనుసంధానంగా త్వరలో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ యూనిట్, ఎయిడ్స్ బాధితుల కోసం ఏఆర్‌టీ సెంటర్, డెంగీ ప్రాంణాంతక వ్యాధుల కోసం ప్లేట్‌లెట్స్ సెఫారేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సేవల కోసం వచ్చే రోగుల బంధువులకు ఆశ్రయం, ఉచిత భోజన వసతి కోసం రూ. 1.31 కోట్లతో నైట్ షెల్టర్‌కు మంత్రులు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 

మరోవైపు వివిధ వైద్య సేవల కోసం వచ్చే రోగుల బంధువులు అశ్రయం పొందేందుకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో నేషనల్ అర్బన్ లవ్లీ ఉడ్ మెప్మా మిషన్ ద్వారా రూ. 1.31 కోట్లతో నైట్ షెల్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడంతస్తుల భవనంలో రోగుల బంధువులకు బసచేసే విధంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇప్పటికే హరే రామ్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, రోగుల బంధువులకు మంత్రి చొరవతో ఉచితంగా భోజనం అందుతోంది. నైట్ షెల్టర్ ఏర్పాటుతో బాధితులు ఆసుపత్రుల్లో మంచాల వద్ద, ఆరుబయట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు.

మరిన్ని వార్తలు