శ్రీమఠంలో సినీ నటి పూజాగాంధీ

22 Oct, 2016 22:02 IST|Sakshi
శ్రీమఠంలో సినీ నటి పూజాగాంధీ
 మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కన్నడ ప్రముఖ సినీ నటి పూజా గాంధీ శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి ఆమెకు మఠం మర్యాదలతో ఆహ్వానం పలికారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జా​‍్ఞపిక, శేషవస్త్రం, ఫలపూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. 
 
మరిన్ని వార్తలు