పల్స్‌ సర్వేకు నిరుద్యోగులు..కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

28 Jul, 2016 00:24 IST|Sakshi

మహారాణిపేట : జిల్లాలో మందకొడిగా సాగుతున్న ప్రజాసాధికారిత సర్వే (పల్స్‌ సర్వే)ను మరింత వేగవంతం చేసేందుకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చర్యలు చేపట్టారు. జిల్లాలో 1051 బందాలు సర్వే చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో 150 బందాలు పని చేయడం లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆయన దష్టిసారించారు.   జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నిరుద్యోగులైన యువతీ, యువకులను ఎంపిక చేసి వారిచే సర్వే చేపట్టేందుకు రంగంసిద్ధం చేశారు.  ఇప్పటికే 124 మందిని ఎంపిక చేసి సర్వే ప్రక్రియలో వారికి శిక్షణ ఇచ్చారు. మరో 200 మందిని ఎంపిక చేసి వారికి కూడా శిక్షణ ఇచ్చి రెండు , మూడు రోజుల్లో పల్స్‌ సర్వేకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పల్స్‌ సర్వే ప్రక్రియలో పూర్తి స్థాయిలో అధికారులు తో పాటు శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొనేలా చేయాలని కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సర్వేలో పాల్గొనే నిరుద్యోగులకు రోజుకు రూ.200 ఇవ్వనున్నారు.

 

మరిన్ని వార్తలు