నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు

22 Aug, 2016 22:54 IST|Sakshi
నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు
విజయవాడ కల్చరల్‌ :
 కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. కార్యక్రమ ప్రారంభంలో ప్రఖ్యాత సంగీత  విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వయోలిన్‌ కచేరీ నిర్వహించారు. గురువందనంతో ప్రారంభించి వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. మరో సంగీత విద్వాంసురాలు విశాఖకు చెందిన మండా సుధారాణి నిర్వహిచిన గాత్ర సంగీత సభ ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా కె.వీ.సత్యనారాయణ బృందం, టి.శ్రావణి, శివసుధీర్‌కుమార్‌(భక్తిరంజని) న్యూఢిల్లీకి చెందిన సంగీతశర్మ ప్యూజన్‌ డాన్స్‌తో అలరించారు.
మహాబృందనాట్య వేదిక మార్పు
ప్రభుత్వం మహా బృంద నాట్యం వేదిక ఇందిరాగాంధీ స్టేడియంగా ప్రకటించింది. కళాకారులకు అలానే సమాచారం అందించారు. ప్రేక్షకుల సంఖ్య పలుచగా ఉండడంతో దానిని సంగమ ప్రాంతానికి మార్చారు. సమాచారం లేక కళాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే కళాకారులు పుష్కర కృష్ణ గీతానికి ఇక్కడ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని రెండురోజుల కిందట ప్రకటించారు. చివరి నిమిషంలో స్టేడియంలో ప్రభుత్వం మరో కార్యక్రమం నిర్వహించటంతో వేదికను మరోచోటుకు మార్చారు. కళాకారులు వ్యయప్రయాసల కోర్చి సంగమం ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చింది.
 
మరిన్ని వార్తలు