మర్యాదగా పలుకరించండి

30 Jul, 2016 23:03 IST|Sakshi
మర్యాదగా పలుకరించండి
 
సాక్షి, అమరావతి :
 కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు విజయవాడ ఆతిథ్యం ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నగరవాసులకు పిలుపునిచ్చారు. నగరంలోని ఏ 1 కన్వెన్షన్‌ సమావేశ మందిరంలో ‘మారుతున్న విజయవాడ’ అనే అంశంపై నగరపాలకసంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొన్నారు. సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, వైష్ణవి ఆర్కిటెక్, నలంద, మేరీస్టెల్లా, పీబీ సిద్ధార్థ, వీఆర్‌ సిద్ధార్థ, కేబీన్‌ కళాశాలల విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్స్, ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు సుమారు 8వేల మీటర్లు పెయింటింగ్స్‌ వేసి విజయవాడను అందంగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకోసం నగరంలోని ప్రతి వ్యక్తి వారికి తోచిన సాయం చేయాలని కోరారు. విద్యార్థులు పుష్కరాలకు ఇచ్చిన సెలవులను వృధా చేయకుండా భక్తుల కోసం వినియోగించాలని కోరారు. విద్యార్థులు వలెంటీర్లుగా పనిచేసేందుకు ముందుకు రావాలన్నారు. విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరని చెన్నై తరువాత అంతటి పేరున్న నగరం విజయవాడేనని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో తొలుత విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. చెట్ల పెంపకంతో కలిగే ప్రయోజనా లు.. పరిశుభ్రత.. పుష్కర స్నానం చేసే విధానంపై విన్నూత్న ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కలుషితమవుతున్న నీరు, పెరుగుతున్న మంచినీళ్ల ధరలుపై విన్నూత్న ప్రదర్శన నిర్వహించారు. వివిధ ¯ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులను సీఎం అభినందించారు. అదే విధంగా విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో మంత్రి మోపిదేవి ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, విజయవాడ నగర మేయర్‌ శ్రీధర్, జిల్లా కలెక్టర్‌ బాబు.ఏ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు