పంట కాపాడామనడం బూటకం

24 Oct, 2016 23:53 IST|Sakshi
పంట కాపాడామనడం బూటకం

అనంతపురం అర్బన్‌:   జిల్లాలో ఎన్నడూ లేనంత దుర్భర కరువు నెలకొందని, తక్షణం కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ డిమాండ్‌ చేశారు. రెయిన్‌ గన్‌లతో పంటను కాపాడామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఒట్టి బూటకమని ధ్వజమెత్తారు.

రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలనే డిమాండ్‌తో రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట రెయిన్‌గన్‌తో బైఠాయించి ధర్నా నిర్వహించారు.  జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడం ఒక తంతుగా మారిందన్నారు. దీన్ని వల్ల ఒరిగేదేమి లేదని విమర్శించారు. ఈ ఏడాది జిల్లాలో భయానక పరిస్థితులున్నా ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోడం లేదన్నారు. కరువు నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

 

మరిన్ని వార్తలు