'చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి'

8 May, 2016 21:53 IST|Sakshi

జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కోరుతూ ఈనెల 13న బీసీ నేతలంతా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.

చట్ట సభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించకపోతే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. రూ.50 వేల కోట్లతో కేంద్రం, రూ.10 వేల కోట్లతో రాష్ట్రం బీసీలకు ఉప ప్రణాళికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు