లక్ష్యనిర్ధేశం ఉంటే ర్యాగింగ్‌కు దూరం

29 Jul, 2016 02:01 IST|Sakshi
మాట్లాడుతున్న ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య
  • ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య
  • ఎచ్చెర్ల: లక్ష్యం ఉన్న విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటారని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య అన్నారు. ‘వర్సిటీలో విద్యార్థులపై ర్యాగింగ్‌ మానసిక ప్రభావం’ అనే అంశంపై ఒక రోజు అవగాహన తరగతి గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీలో విద్యార్థులు ఎందుకు అడుగుపెట్టారు, తల్లిదండ్రులు పిల్లలను ఏ ఆశయంతో చదివిస్తున్నారు అనే అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. ర్యాగింగ్‌ చేయడం సైతం ఒక మానసిక రోగంగా చెప్పారు. నిర్థిష్ట లక్ష్యంతో కళాశాలల్లో చేరే విద్యార్థులపై ర్యాగింగ్‌ ప్రభావం చూపుతుందని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరలేడని, ర్యాగింగ్‌ బాధిత వ్యక్తి మానసికంగా చదువుపై దృష్టి పెట్టలేడన్నారు. బీఆర్‌ఏయూ ర్యాగింగ్‌ ఫ్రీ క్యాంపస్‌ అని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులను క్షమించేది లేదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్‌ పెద్దకోట చిరంజీవులు మాట్లాడుతూ వర్సిటీలో ర్యాగింగ్‌కు తావు లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థుల మానసిక పరిస్థితి, బాధితుల మానసిక సంఘర్షణపై విద్యా విభాగం మానసిక శాస్త్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేఎల్‌ సంధ్యారాణి విద్యార్థులకు వివరించారు.
     
మరిన్ని వార్తలు