'లంచం ఇస్తేనే అందులో పని జరుగుతోంది'

2 Jul, 2016 15:07 IST|Sakshi

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయిందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. రూ. 25వేలు లంచం ఇస్తేనే జన్మభూమి కమిటీల్లో పని జరుగుతోందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు మినహా చంద్రబాబు కొత్తగా చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని రఘువీరా రెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు