దుర్గమ్మ సన్నిధిలో రాహుకాల పూజలు

30 Aug, 2016 19:36 IST|Sakshi
దుర్గమ్మ సన్నిధిలో రాహుకాల పూజలు

కడప కల్చరల్‌:
కడప నగరం శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం మహిళా భక్తులు తమ కష్టాలను తొలగించాలంటూ అమ్మవారిని వేడుకుని రాహుకాల పూజలను నిర్వహించారు. దీక్షల్లో ఉన్న మహిళలు ఆలయంలోని అమ్మవారి మూలమూర్తికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఫణిభూషణశర్మ ఆధ్వర్యంలో రాహుకేతు సమేత గ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసంలోచివరి మంగళవారం గనుక మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

 

మరిన్ని వార్తలు