రెయిలింగ్ కూలి 5 కార్లు ధ్వంసం

28 Jul, 2016 16:36 IST|Sakshi
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో రెయిలింగ్ కూలి 5 కార్లు ధ్వంసం అయ్యాయి. గురువారం మధ్యాహ్నం భవనం రెయిలింగ్ కూలి పడటంతో కింద పార్కు చేసిన ఐదు కార్లు దెబ్బతిన్నాయి. కాంప్లెక్స్ నిర్వాహకులు అప్రమత్తమై పెచ్చులను తొలగించి, దెబ్బతిన్న కార్లను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.
 
మరిన్ని వార్తలు