రైల్వేకు రూ.47 కోట్ల ఆదాయం

24 Aug, 2016 22:47 IST|Sakshi
రైల్వేకు రూ.47 కోట్ల ఆదాయం
విజయవాడ (రైల్వేస్టేషన్‌) :
 కృష్ణా పుష్కర యాత్రికుల ద్వారా రైల్వే శాఖకు రూ.47 కోట్ల ఆదాయం లభించిందని విజయవాడ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆదాయం సాధారణ, రిజర్వేషన్‌ టికెట్ల ద్వారా లభించినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 42 లక్షల మంది యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో కృష్ణా పుష్కరాలకు విచ్చేశారని, వారందరిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. పుష్కరాలకు సాధారణ రైళ్లతోపాటు 625 ప్రత్యేక రైళ్లను నడిపామని వివరించారు. పలు రైళ్లకు 4,871 అదనపు బోగీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది 1,250 మంది, జీఆర్పీ సిబ్బంది 1,400 మంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. యాత్రికులకు కమర్షియల్‌ సహా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు విశేష సేవలందించారని తెలిపారు.
 
మరిన్ని వార్తలు