వానోచ్చింది.. మత్తడి దుంకింది..

4 Sep, 2016 00:18 IST|Sakshi
వానోచ్చింది.. మత్తడి దుంకింది..
మెదక్, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీటి ఉధృతికి  శనివారం మధ్యాహ్నం నల్లవాగు మత్తడి పొంగిపొర్లింది. మత్తడికి ఎగువ ప్రాంతాల్లో ఉన్న కల్హేర్, కంగ్టి, నారాయణఖేడ్‌ మండలాల్లో కురిసిన వర్షానికి వాగుల ద్వారా వరద నీరు వస్తోంది. తద్వారా మండలంలోని నల్లవాగు మత్తడికి జలకళ నెలకొంది. నల్లవాగు మత్తడి అలుగుపై నుంచి వరదనీరు పొంగిప్రవíß స్తుండడంతో ఆయకట్టు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నిజాంసాగర్‌ 
మరిన్ని వార్తలు