45 మండలాల్లో వర్షం

31 Jul, 2016 22:36 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: ఆదివారం జిల్లా వ్యాప్తంగా 45 మండలాల పరిధిలో 2.6 మిమీ సగటు వర్షపాతం నమోదైంది. ఓడీ చెరువు 15.4 మిమీ, ఎన్‌పీ కుంట 14 మిమీ, నల్లమాడ 13.4 మిమీ, ముదిగుబ్బ 12.4 మిమీ, పుట్టపర్తి 10.4 మిమీ వర్షం పడగా మిగతా మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 67.4 మిమీ కాగా 102.8 మిమీ వర్షపాతం నమోదైంది. అందులో చివరి వారం రోజుల్లోనే 79 మిమీ వర్షం కురవడం విశేషం.  

మరిన్ని వార్తలు