57 మండలాల్లో వర్షం

24 Aug, 2017 22:03 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలోని 57 మండలాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వర్షం కురిసింది. దీంతో 7.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. 33 మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. అమరాపురం, గుడిబండ, నార్పల, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మిగతా మండలాల్లో తుంపర్లు పడ్డాయి. అత్యధికంగా పుట్టపర్తిలో 26.8 మి.మీ, ఓడీ చెరువు 26.4 మి.మీ, అనంతపురం 25.8 మి.మీ, అగళి 24 మి.మీ, ఉరవకొండ 21.2 మి.మీ, బెళుగుప్ప 19.8 మి.మీ, నల్లమాడ 18.5 మి.మీ, అమడగూరు 16 మి.మీ వర్ష పాతం నమోదైంది. చిలమత్తూరు, సోమందేపల్లి, రొద్దం, పెనుకొండ, తలుపుల, ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, బుక్కరాయసముద్రం, కళ్యాణదుర్గం, కుందుర్పి, పామిడి, విడపనకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 75 మి.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు