53 మండలాల్లో వర్షపాతం

18 Sep, 2017 21:57 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: 

 జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం 53 మండలాల పరిధిలో 2.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. శెట్టూరు 15.6 మి.మీ, పెనుకొండ 12.1 మి.మీ వర్షం పడగా..మడకశిర, గుడిబండ, రొద్దం, కొత్తచెరువు, బుక్కపట్టణం, పుట్టపర్తి, గోరంట్ల, నల్లమాడ, ఓడీ చెరువు, కదిరి, గాండ్లపెంట, ఎన్‌పీకుంట, తలుపుల, ముదిగుబ్బ, కనగానపల్లి, పుట్లూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, బ్రహ్మసముద్రం, గార్లదిన్నె, పామిడి, శింగనమల, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, వజ్రకరూరు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 132.2 మి.మీ నమోదైంది. అలాగే జూన్‌ నుంచి ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 279.4 మి.మీ గానూ 14 శాతం అధికంగా 319.2 మి.మీ నమోదైంది. 

మరిన్ని వార్తలు