కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు

8 Jul, 2016 10:00 IST|Sakshi

విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం చెప్పింది.

మరిన్ని వార్తలు