నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

1 Nov, 2015 11:18 IST|Sakshi

విశాఖపట్నం : తమిళనాడు తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా.... ఉత్తర బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే కోస్తా తీరం వెంబడి 45  - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
 

మరిన్ని వార్తలు