కోస్తాంధ్రలో వర్షాలు !

25 Jun, 2016 16:51 IST|Sakshi

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది నేడో రేపో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉత్తర కోస్తాలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరిన్ని వార్తలు