జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు

21 Sep, 2016 21:13 IST|Sakshi
 కర్నూలు(అగ్రికల్చర్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి 48 మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 9.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. దీంతో రైతులు రబీ సాగుకు సిద్ధం అవుతున్నారు. చాగలమర్రిలో అత్యధికంగా 27 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. పత్తికొండలో 25, సంజామలలో 21.8, సి.బెళగల్‌లో 19.8, ఆళ్లగడ్డలో 19, తుగ్గలిలో 18.4, గూడూరులో 17.2, గడివేములలో 16.8, ఉయ్యలవాడలో 16.8, మహానందిలో 16.2, దొర్నిపాడులో 16, కోవెలకుంట్లలో 15.8, ప్యాపిలిలో 15.8, డోన్‌లో 15.6, కోడుమూరులో 15.2 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 102.1 మి.మీ. నమోదైంది.
 
మరిన్ని వార్తలు