తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు !

27 Aug, 2015 08:54 IST|Sakshi

విశాఖపట్నం : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం విశాఖపట్నంలో వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను అనుకొని ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు