రాజన్న సన్నిధిలో వరుణయాగం

24 Jul, 2016 18:07 IST|Sakshi
రాజన్న సన్నిధిలో వరుణయాగం
  • 7,8,9 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు 
  • వేములవాడ : వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఆగస్టు 7,8,9 తేదీల్లో రుష్యశృంగ వరుణయాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్‌ అర్చకులు, పూజల విభాగం సిబ్బందితో సమావేశం నిర్వహించి యాగం ఏర్పాట్లపై చర్చించారు. రుష్యశృంగ మహాముని విగ్రహ ప్రతిష్ట, వరుణజపం, స్వామివారికి సంతత ధారాభిషేకం, వరుణయాగహవనంతోపాటు అనుబంధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో రాజేశ్వర్‌ తెలిపారు. భక్తులు రాజన్న దర్శనం, కోడె మొక్కులు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. గతంలో వరుణయాగం ధర్మగుండం పక్కన నిర్వహించేవారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతున్నట్లు భావించి ఈసారి ఆలయం ముందు భాగంలో యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు