ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేది లేదు

5 Apr, 2017 00:02 IST|Sakshi
  • విలేకర్ల సమావేశంలో ముద్రగడపై ఉప ముఖ్యమంత్రి నిప్పులు
  • భానుగుడి (కాకినాడ) :  
    ముఖ్యమంత్రిని అవినీతి పరుడంటూ ముద్రగడ విమర్శించడం పట్ల ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనస్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిదని, కాపులకోసం కమిష¯ŒS వేసిన ఘనత చంద్రబాబుదని, కాపు ఉద్యమం పేరిట రాజకీయాలు చేయడం ముద్రగడకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రశేఖర్‌ అనే అనుయాయునికి సర్వీస్‌ కమిష¯ŒS పదవి ఇవ్వాలని  ఎంపీగా ఉన్నపుడు ముద్రగడ కోరారని, ఇపుడు నిజాయితీ పరునిగా కథలు అల్లుతున్నారన్నారు. ఇటీవల ఓ వ్యక్తి రాసిన పుస్తకం ద్వారా ముద్రగడ చరిత్ర ఎంత హీనమయిందో తెలుస్తుందన్నారు. 
     
మరిన్ని వార్తలు