దేవునికి ద‌గ్గ‌ర‌గా...

1 Jul, 2016 01:28 IST|Sakshi
దేవునికి ద‌గ్గ‌ర‌గా...

రంజాన్ స్పెష‌ల్
మూడు భాగాలుగా(పదేసి రోజులుగా) విభజించిన  పవిత్ర రంజాన్ మాసంలోని చివరి అంకం పూర్తి కావస్తోంది. చేసిన పాపాల నుంచి విముక్తి కోరేందుకు చివరి దీక్ష రోజులు ప్రత్యేకంగా కేటాయించారని ముస్లింలు చెబుతారు.అంతరార్థంలో పాపాలు చేయొద్దనే సూక్తి ఉందని అంటారు. తల్లిని ప్రేమించడం, మనిషిని మనిషిలాగానే చూడడం, మద్యపానానికి దూరంగా ఉండడం, విచ్చల విడితనం మంచిది కాదని తెలుసుకోవడం ఈ దశకం ప్రత్యేకతలని అంటారు.    
- విశాఖపట్నం  

 
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12 నెలల్లో రంజాన్ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది 29 లేక 30 రోజులుంటాయి. మనిషిలో ప్రాపంచిక కోర్కెలు, ఈర్ష్య, అసూయలను దహించేదిగా రంజాన్‌ను అభివర్ణించినట్టు హదీస్‌లో పేర్కొనబడిందని మతపెద్దలు చెబుతారు. పవిత్ర మాసాన్ని దీన్నే మూడు భాగాలుగా విభజించారు. మొదటి పది రోజులను ‘రెహమత్‌కా అష్ర’ అంటారు. ఇందులో అల్లా కరుణ, దయ ఉంటుందని,  రెండో దశలో ‘మగ్‌ఫిరత్‌కా అష్ర’, చేసిన పాపాలకు క్షమాపణను కోరడం,  మూడో దశలో ‘జహన్నం సే ఫనా మాంగ్‌నే కా అష్ర’ నరకం నుంచి విముక్తి కోసమని ఉపవాస దీక్షలో అల్లాను మనస్ఫూర్తితో ప్రార్థించాలని మతపెద్దలు చెబుతారు.
 
స్వచ్ఛమైన మనసు ఉంటేనే...
మద్యం సేవంచేవారు , తల్లిదండ్రులపై ప్రేమ, కరుణ చూపనివారు, బం దుత్వాలను తెగదెంపులు చేసేవాళ్లు, ఈర్ష్యాద్వేషా లు కలిగిన వారు, విచ్చలవిడిగా శృంగారాల్లో పాల్గొనే వ్యక్తుల పాపాలను అల్లా క్షమించడని,  అయితే రంజాన్ మాసం లో ఉపవాస దీక్షలో స్వ చ్ఛమైన మనసుతో  మ రోసారి  తప్పులు చేయనని వేడుకుంటే అల్లాహ్ విముక్తి కల్పిస్తారని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధిస్తోందంటున్నారు. రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారం ‘జమా- తుల్-విదా’ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
 
దానకార్యాలకు ప్రాధాన్యం..
రంజాన్ మాసంలో  ఉపవాస దీక్షలు ప్రారంభించి నెలవంకను చూసి దీక్షలు ముగిస్తారు. ఉపవాస దీక్ష చేపట్టిన ప్రతి వ్యక్తి ఉదయం నుంచి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు.సాధారణ రోజుల కంటే రంజాన్‌లో చేసిన దానానికి 70 రెట్లు పుణ్యం చేకూరుతుందని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధిస్తుంది.  పేదలు కూడా పండగ చేసుకోవాలనే సదుద్దేశంతో ఫిత్రా, జకాత్ వంటి దానాలు చేస్తారు.

‘జకాత్’లో భాగంగా సంపాదించిన సొమ్ములో రెండున్నర శాతాన్ని దానం చేయాలని, ‘ఫిత్రా’లో భాగంగా రెండు కిలోల 45 గ్రాముల గోధుములు గాని, లేక తదనుగుణంగా మార్కెట్ ధరను పేదలకు అందజేయాలని మతపెద్దలు చెబుతారు.  నిరుపేదలకు దుస్తులు, సరుకులు, ఆహార  రూపంలో అందిస్తారు.  ‘ఫిత్రా’ అనేది ప్రతి ముస్లింకు తప్పనిసరి. రంజాన్ పండగ లోపు పేదలకు అందజేయాలి. ‘ఫిత్రా’ ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పండగను ఈద్-ఉల్-ఫితర్‌గా పేర్కొనడం జరిగింది.
 
ఇతేకాఫ్
ప్రపంచంతోపాటు సమాజ సుఖాలను త్యజించి రం జాన్ నెలలో ఆఖరి  పది రోజులపాటు పూర్తిగా అల్లా కోసం గడిపే కార్యక్రమాన్ని ఇతేకాఫ్ అంటారు. మసీదులో మూలన గుడారం ఏ ర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి.ఖురాన్ ప ఠనం, అల్లాహ్ ధ్యానం లో గడపాలి. దీంతో చాలా పుణ్యం చేకూరుతుందని పవిత్ర గ్రంథంలో ఖురాన్‌లో పేర్కొన్నట్టు మతపెద్దలు చెబుతారు.
 
లైల-తుల్-ఖద్ర్ ప్రత్యేకత..
రంజాన్ నెలలో 26వ రాత్రిని లైల-తుల్-ఖద్ర్(పెద్దరాత్రి) జరుపుకుంటారు. రాత్రంగా జాగరణ చేసి అల్లాను ఆరాధించి నమాజులు చేసి, ఖురాన్ పఠించి, దువా చేసి అనుగ్రహం పొందితే మరణం తర్వాత స్వర్గం లభిస్తుందని ఖురాన్ బోధిస్తోంది. వెయ్యి నెలల పాటు నిత్యం అల్లాహ్‌ను ఆరాధిస్తే లభించే పుణ్యం కేవలం లైల-తుల్-ఖద్ర్ రాత్రిన ఆరాధనలతో లభిస్తుందని, ఇదే రోజున పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మతపెద్దలు చెబుతారు. లైల-తుల్-ఖద్ర్ రాత్రి నాడు తరావీ నమాజ్‌లో ఖురాన్ ఆఖరి ఆధ్యాయ పఠన పూర్తవుతుంది. రాత్రంగా జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్‌లు చేస్తారు. నగరంలోని అన్ని మసీదుల్లో లైల-తుల్-ఖద్ర్ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా అన్ని మసీదుల్లో సహరీ ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులన్నీ విద్యుత్‌దీపాలతో అలంకరించారు.  
 
శాంతి, సహనానికి ప్రతీక  రంజాన్
దేవునిపై నమ్మకం, తమను తాము ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంచుకుని, నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి తరువాత చేసుకునే పండగ ఈద్-ఉల్-ఫిత్’(రంజాన్). శాంతి, సహనానికి ప్రతీకగా ఈ పండగ నిలుస్తోంది. నెలవంక చూసిన తర్వాతనే పండగ జరుపుకోవాలని మహమ్మద్ ప్రవక్త హదీస్‌లో పేర్కొన్నారు. రంజాన్ పండగ ప్రత్యేక నమాజ్‌కు వచ్చే ముందుగానే ‘ఫిత్రా’, ‘జకాత్’ దానాలు పేదలకు అందజేయాలి.
- మౌలానా మౌల్వీ పాజిల్ సయ్యద్ షాహుల్ హమీద్,ఇమామ్ వ ఖతీబ్, యాసీన్ మసీద్, న్యూరేసపువానిపాలెం, విశాఖపట్నం

మరిన్ని వార్తలు