ఈ రామాలయం ప్రత్యేకం

5 Apr, 2017 00:09 IST|Sakshi
ఈ రామాలయం ప్రత్యేకం

శతాబ్ధాల క్రితం శింగనమలలో వెలసిన సీతారాముల ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ప్రతిష్టించిన సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలు రాష్ట్రంలోని మరే ప్రాంతంలోనూ లేకపోవడం గమనార్హం. ఆత్మసీతారాములు ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం నిర్మాణం వెనుక చరిత్ర పరిశీలిస్తే... ‘శతాబ్ధాల క్రితం బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే శింగనమలలో ఆత్మసీతారాముల ఆలయాన్ని రంగరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాల్లో రాముల వారి విగ్రహం పద్మ పీఠంపై కూర్చొని మెడలో తులసిమాలతో పద్మాసన ముద్రలో ఆత్మతత్వ్తం గురించి చెబుతున్నట్లుగా ఉంది. సీతమ్మ వారి విగ్రహం కూడా ధ్యానముద్రలో ఉంది. అంజలి ఘటిస్తూ లక్ష్మణ స్వామి, రామనామ జపం చేస్తున్నట్లుగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఛైత్రమాసంలో నవమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ బ్రహోత్మవాలను నిర్వహిస్తుంటారు. పౌర్ణమి నాడు కల్యాణోత్సవం, రథోత్సవం ఉంటుంది. చెరువులో నీరు ఉంటే కార్తీక మాసంలో తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు.  
- శింగనమల

మరిన్ని వార్తలు