నిలువెత్తు గెల!

12 Dec, 2016 15:02 IST|Sakshi
నిలువెత్తు గెల!
ఆరడుగుల ఎత్తు, 25 అత్తాలు
అబ్బురపరచిన అరటి గెల
సాధారణంగా మూడడుగుల ఎదిగే అరటి గెల ఏకంగా ఆరడుగులు పెరిగి అబ్బుర పరుస్తోంది. రావులపాలెం ప్రాంతంలో అరుదుగా కనిపించే కర్ణాటక చెక్కరకేళీగా పిలిచే బూడిద బక్కీస్‌ రకానికి చెందిన భారీ గెలను స్థానిక అరటి మార్కెట్‌కు బుధవారం అమ్మకానికి తీసుకువచ్చారు. రావులపాలానికి చెందిన మల్లిడి త్రినాథరెడ్డి తన ఇంటి పెరడులో పెంచిన  చెట్టుకు కాసిన గెల పక్వానికి రావడంతో తన సైకిల్‌పై యార్డుకు తీసుకువచ్చాడు. ఆ గెలను కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరికి కొమరాజులంకకు చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి రూ.650కు కొనుగోలు చేశారు. ఈ గెలలో మొత్తం 25 అత్తాలు ఉండగా, ఒక్కో అత్తంలో సుమారు 20 నుంచి 25 కాయలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 600 కాయలు ఉంటాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గెలను అంతా ఆసక్తిగా తిలకించారు.    
- రావులపాలెం
మరిన్ని వార్తలు