రసాభాస

1 Jun, 2017 00:41 IST|Sakshi
రసాభాస
 – విద్యార్థి సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెంట్లతో అధికారుల సమావేశం
- విద్యార్థి సంఘాల ప్రశ్నలకు నీళ్లు నమిలిన కరస్పాండెంట్లు
– చందాలు ఇస్తున్నామంటూ ఎదురుదాడి
– అర్ధంతరంగా సమావేశం రద్దు చేసిన జేసీ-2
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో  ఫీజుల నియంత్రణపై జేసీ–2 రామస్వామి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ప్రైవేట్‌ స్కూళ్ల కరస్పాండెంట్లు, హెచ్‌ఎంలు, విద్యార్థి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. డీఈఓ తాహెరా సుల్తానా అధ్యక్షతన ముందుగా అధికారులు విద్యార్థి సంఘాల నాయకులు వై.ఓబులేసు(ఎస్సీ, ఎస్టీ విద్యార్థి పరిషత్‌), శ్రీరాములు(ఆర్‌పీఎస్‌ఎస్‌ఎఫ్‌), నాగమధు యాదవ్‌(ఎన్‌ఎస్‌యూఐ), రవికుమార్‌(ఆర్‌వీఎస్‌ఎఫ్‌), అక్బర్‌(ఎస్‌ఎఫ్‌ఐ) చంద్రప్ప(టీఎస్‌ఎఫ్‌)లతో సమావేశం అయ్యారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన జీఓలు 1, 42, 37, 99 లను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. 
 
దూసుకొచ్చిన విద్యార్థి సంఘాల నేతలు
ప్రైవేట్‌ స్కూళ్ల అసోసియేషన్‌ నాయకులు జి.పుల్లయ్య, కట్టమంచి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్పొరేట్‌ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశమైన జేసీ–2 అధికంగా ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రైవేట్‌ స్కూళ్ల అసోసియేషన్‌ నాయకులు స్పందిస్తూ కార్పొరేట్‌ స్కూళ్లలోనే అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నారని, ఆయా పాఠశాలల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు.  మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని కూడా పిలిపిస్తామని అధికారులు పేర్కొంటుండగా విద్యార్థి సంఘాల నాయకులు సమావేశంలోకి దూసుకొచ్చి నగరంలోని కొన్ని ప్రైవేట్‌పాఠశాలల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో వివరించారు.  ముఖ్యంగా రిడ్జ్, కట్టమంచి, అథెనా తదితర స్కూళ్లు ఒక్కో ఏడాదికి రూ.లక్ష వసూలు చేస్తున్నాయన్నారు. అందుకు వారు ప్రతిగా సంఘాల పేరుతో చందాలు వసూలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఇందుకు ఎవరికీ చందాలు ఇచ్చారో చెప్పాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రైవేట్‌ స్కూళ్ల అసోసియేషన్‌ నాయకుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు జేసీ–2 ప్రకటించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా డీఈఓ మాత్రం సమావేశంలో నోరు మెదకపోవడం గమనార్హం.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!