పిక్క కొడితే కరీంనగర్కు కలెక్టర్ అవుతా:రసమయి

26 Sep, 2015 18:57 IST|Sakshi

కరీంనగర్: పిక్క కొడితే కరీంనగర్కు కలెక్టర్ అవుతానని తెలంగాణ సాంస్కృతిక సారథి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ.. పీహెచ్డీ కోసం 500 మంది ప్రవేశ పరీక్ష రాస్తే జనరల్ కేటగిరీలో సీటు సంపాదించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై రసమయి తీవ్రంగా మండిపడ్డారు.

రైతుల ఆత్మహత్యలను పతాక శీర్షికలో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే దేశంలో అయితే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులను ఉరితీసిన దాఖలాలు ఉన్నాయన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పత్రికలు వ్యవహరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు