పేదల బియ్యం పట్టివేత

12 Dec, 2016 14:41 IST|Sakshi
పేదల బియ్యం పట్టివేత

డోన్‌ టౌన్‌ : దారిమళ్లుతున్న పేదల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు..బుధవారం స్వాధీనం చేస్తున్నారు. పట్టణ శివారులోని కొత్తపల్లె పారిశ్రామిక ప్రాంతంలో ఏపీ21పీవై 9534 నెంబరు గల అప్పీ ఆటోలో 44 క్వింటాళ్ల 40 కేజీల తరలిస్తుండగా అధికారులు దాడులు చేశారు. బియ్యంతోపాటు ఆటోను సీజ్‌ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ ఎస్‌ఐ సుబ్బరాయుడు, తహసీల్దార్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణగిరి మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి అండదండలతో రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఒక చిన్న రేకుల షెడ్డును నిర్మించి రోజూ కొనుగోలు చేసిన బియ్యాన్ని, ఇక్కడి నుంచి లారీల్లో కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. బుధవారం పట్టుబడిన బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులు మధుసుధాకర్, ధర్మవరం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పంచనామా జరిపి మండల స్టాక్‌ పాయింట్‌లో భద్రపరిచారు. ఇదిలా ఉండగా..ఈ ఏడాది జిల్లా విజిలెన్స్, రెవెన్యూ అ«ధికారులు డోన్‌లో ఔదు సార్లు దాడులు జరిపి పెద్దమొత్తంలో బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అయినా అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం కొనసాగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు