రేషన్‌ బియ్యం పట్టివేత

14 Sep, 2016 00:54 IST|Sakshi
రేషన్‌ బియ్యం పట్టివేత
 
వెంకటాచలం : తమిళనాడు నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన 17 టన్నుల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. తమిళనాడు నుంచి టీఎన్‌18ఏబీ 9291 నంబరు లారీలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్‌ బియ్యంను నెల్లూరుకు రవాణా చేస్తున్నారనే సమాచారం విజిలెన్స్‌ అధికారులకు మంగళవారం తెల్లవారు జామున సమాచారం అందింది. దీంతో విజిలెన్స్‌ అధికారులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటల సమయంలో ఏపీ 26 టీఏ7776 నంబరుతో ఉన్న లారీని విజిలñ న్స్‌ అధికారులు తనిఖీ చేయగా అందులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీకు నకిలీ నంబర్‌ స్టిక్కరు అతికించి ఉండటాన్ని గమనించి సిక్కరును తొలగించారు. స్టిక్కరు కింద టీఎన్‌18ఏబీ 9291 నంబర్‌ ఉండటంతో సమాచారం వచ్చిన లారీ ఇదేనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్‌ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి చేరుకుని అక్రమ బియ్యం రవాణా చేస్తున్న లారీని పరిశీలించారు.  ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, తమిళనాడుకు చెందిన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు. ఈ లారీలో 17 టన్నులు రూ.4 లక్షల విలువగలిగిన బియ్యం పట్టుకున్నామన్నారు. లారీ యజమాని దినేష్, దళారి మునుస్వామి, డ్రైవర్‌ మదన్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ బియ్యం ఎక్కడకు తరలిస్తున్నారో విచారణలో తేలుస్తామన్నారు. ఆయన వెంట విజిలెన్స్‌ సీఐలు ఉప్పాల సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఏఓ ధనుంజయరెడ్డి, ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు