పట్టుదలతో చదివితే ఉద్యోగాలు

7 Aug, 2016 00:17 IST|Sakshi
ఖిలావరంగల్‌ : నిరుద్యోగులు పట్టుదలతో చదివితే తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని టీఎస్‌ఎస్పీ ఇన్‌చార్జి కమాండెంట్‌ శ్రీనివాస్‌కుమార్‌ సూచించారు. నగర శివారులోని మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌ లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులతో శనివారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కమాండెంట్‌ శ్రీనివాస్‌కుమార్‌ మాట్లాడుతూ బెటాలియన్‌లో సుమారు 300 మం ది అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం శిక్ష ణ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో 60 మంది బాలికలు, 90 మంది బాలురు దేహదారుఢ్య పరీక్షల్లో రాణించినట్లు తెలిపారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యర్థులు తగిన రీతిలో సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ అంజయ్య, శిక్షణ ఇన్‌ స్పెక్టర్లు భాస్కర్, ఘని, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు