‘ఇష్టపడి చదివితేనే ఉన్నతి’

24 Aug, 2016 23:21 IST|Sakshi
‘ఇష్టపడి చదివితేనే ఉన్నతి’
కామారెడ్డి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌(ట్రస్మా) ఆ«ద్వర్యంలో కామారెడ్డిలో పదో తరగతి విద్యార్థులకు విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రయత్నించాలన్నారు. విజయాన్ని అందిపుచ్చుకోవడానికి ఇష్టంతో చదవాలని సూచించారు. పదోతరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం, పదో తరగతి తర్వాత చదవాల్సిన కోర్సుల ఎంపిక తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బల్‌రాం, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు టి.ఆనంద్‌రావ్, ప్రధాన కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి కృష్ణమూర్తి, మాస్టర్‌ మైండ్స్‌ అధినేత మోహన్, ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు