ప్రాజెక్ట్‌లపై చర్చకు సిద్ధం

4 Sep, 2016 21:03 IST|Sakshi
మాట్లాడుతున్న విజయరమణారావు
  • నీటి విడుదల షెడ్యూల్‌ తప్పితే సీఈ ఆఫీస్‌పై దాడి
  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
  • టవర్‌సర్కిల్‌ : ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు టీఆర్‌ఎస్‌ నాయకుల సవాల్‌కు ప్రతిసవాల్‌ విసిరారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఇచ్చిన ప్రాజెక్ట్‌లపై చర్చకు సవాల్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ఏయే గ్రామాలకు సాగునీరందించారో నిరూపించాలన్నారు. తనకు మతిభ్రమించిందనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీలో 25 టీఎంసీల నీరున్నప్పుడే ఆయకట్టు చివర భూములకు ఐదు దఫాలుగా నీరందింపజేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా సాగునీరందించలేని అసమర్థులు అధికార పక్షం నాయకులు అని విమర్శించారు. ఈద, దాసరిలకు చేతనైతే చివరి భూములకు నీరందించాలని సవాలు విసిరారు. తనపై ఇప్పటి వరకు 26 కేసులున్నాయని, ఎస్సారెస్పీకి సంబంధించినవే 12 కేసులు అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిని షెడ్యూల్‌ ప్రకారం విడుదల చేయకపోతే సీఈ కార్యాలయంపై దాడి చేయకతప్పదని హెచ్చరించారు. ఎల్లంపల్లి నీటి తరలింపును అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, సదానందం, పుట్ట నరేందర్, గట్టు యాదవ్, బాలాగౌడ్, జగన్‌గౌడ్, గాజె రమేశ్, తీట్ల ఈశ్వరి, కమలాకర్, సలీం, రమేశ్, రాజమల్లయ్య, అజయ్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు