దసరాలో రికార్డుస్థాయి ఆదాయం

19 Oct, 2016 21:12 IST|Sakshi
దసరాలో రికార్డుస్థాయి ఆదాయం

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు భక్తులు రికార్డుస్థాయిలో రూ.5,16,92,054 నగదు కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. మొత్తం ఐదు రోజుల పాటు హుండీల లెక్కింపు జరిగింది. బుధవారం ఐదో విడత జరిగిన లెక్కింపులో రూ.45.32 లక్షల ఆదాయం సమకూరింది. ఉత్సవాల 11 రోజులతో పాటు ఆ తరువాత ఐదు రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగింది. అటు భక్తులు, ఇటు భవానీలు అమ్మవారికి కానుకలను భారీగానే సమర్పించారు. నగదుతో పాటు 810 గ్రాముల బంగారం, 19.543 కిలోల వెండి లభ్యమైంది.
 

మరిన్ని వార్తలు