రికార్డు స్థాయిలో వరసిద్ధుని ఆదాయం

1 Oct, 2016 00:16 IST|Sakshi
హుండీల లెక్కింపు చేస్తున్న ఆలయ సిబ్బంది
కాణిపాకం(ఐరాల) : కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో  రూ.89 లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.కోటి 7 లక్షలకు చేరింది. శుక్రవారం ఆలయ ఆన్వేటి మండపంలో ఈవో పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 31 రోజులకు గాను నగదు రూపంలో రూ.1,07,86,619 వచ్చింది. బంగారం 50 గ్రాములు, కేజీ వెండి కానుకగా అందింది. నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.9,297, ప్రచార రథం హుండీ ద్వారా రూ.14,505, భిక్షాండి హుండీలో రూ.8,311 వచ్చింది. విదేశీ కరెన్సీ సైతం వచ్చినట్లు ఈవో పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఏపీ వెంకటేషు, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్‌ రవీంద్ర, స్వాములు వెంకటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున, చిట్టిబాబు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు