12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

1 Aug, 2016 02:04 IST|Sakshi
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
 
వెంకటగిరి : మండలంలోని సీసీ కండ్రిగ దళితవాడ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కారులో అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కారు సహా రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. వెంకటగిరి సబ్‌ డీఎఫ్‌ఓ రవీంద్రారెడ్డి కథనం మేరకు.. సీసీకండ్రిగ సమీపంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు తమకు సమాచారం అందడంతో నిఘా ఉంచామన్నారు. ఆదివారం తెల్లవారు జామున కారు అనుమానాస్పదంగా సీసీకండ్రిగ చెరువు వద్ద నుంచి తెలుగుగంగ కట్ట మీదుగా వస్తుండంతో వెంబడించామని తెలిపారు. దీంతో సీసీకండ్రిగ సమీపంలోని గుండ్ల సముద్రం కాలనీ వద్ద కారును వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. కారు లోపల 12 ఎర్రచందనం దుంగలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఫారెస్ట్‌ రేంజర్‌ జి వెంకటేశ్వర్లు,  పీఆర్వో వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, డక్కిలి డీఆర్వో డివి రమణయ్య, ఎఫ్‌బీఓ చంద్రశేఖర్, మస్తాన్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు