9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్‌

1 Nov, 2016 10:22 IST|Sakshi
9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్‌

ఖాజీపేట: దువ్వూరు మండలం సీతానగరం పైభాగంలో ఉన్న కన్నెల వాగు చెరువు సమీపంలో 9 మంది ఎర్రచందనం కూలీలసు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం తెలిపారు. ఖాజీపేట పోలీస్‌ స్టేషలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు సీతానగరం పై భాగాన ఉన్న కన్నెలవాగు చెరువు సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో ఖాజీపేట యస్‌ఐ రంగారావు, దువ్వురు యస్‌ఐ విద్యాసాగర్, ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారన్నారు. అప్పటికే మొద్దులు తీసుకుని వస్తున్న వారు తమపై రాళ్లతో దాడి చేశారన్నారు.  అయినా గట్టిగా ప్రతిఘటించి 9 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 314 కేజీల బరువు గల ఈ దుంగల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందన్నారు. తాము అరెస్టు చేసిన వారంతా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. గత కొంత కాలంగా ముమ్మరంగా అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించడం వల్ల ఇప్పటివరకు మైదుకూరులో ఏడుగురు, ఖాజీపేటలో ఏడుగురు, దువ్వురూ లో స్థానిక స్మగ్లర్లు ఏడుగురు, ఇప్పడు 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. ఇప్పటికి అడవుల్లో కూంబింగ్‌ జరుగుతూనే ఉందన్నారు.

మరిన్ని వార్తలు