రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం

8 May, 2017 21:48 IST|Sakshi
రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం
–జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ
కర్నూలు(హాస్పిటల్‌): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ అన్నారు. వరల్డ్‌ రెడ్‌క్రాస్‌ డే సందర్భంగా సోమవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కర్నూలు బ్రాంచ్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, రెడ్‌క్రాస్‌ వ్యవస్థాపకుడు హెన్నీ డొనాల్ట్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్‌ డే నిర్వహిస్తారన్నారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో రక్తదాతల సంఖ్య మరింత పెరగాలని, ఈ దిశగా రెడ్‌క్రాస్‌ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి, జిల్లా చైర్మన్‌ జి. శ్రీనివాసులు మాట్లాడుతూ భవిష్యత్‌లో  సేవలు మరింత విస్తృతపరుస్తామన్నారు.
 
జిల్లాలోని 56 మండలాల్లో రెడ్‌క్రాస్‌ ద్వారా నీరు–చెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఐదుగురు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ జి. శ్రీనివాసులుకు బంగారు పతకం, కోశాధికారి జె. రఘునాథ్‌రెడ్డి, ఈసీ మెంబర్‌ డి. దస్తగిరి, టి. రాధాకృష్ణ, బి. ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్‌ ఎం. వెంకటయ్య, ఎం. పద్మావతి, ఎం. నాగరాజు, గోరంట్ల ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్, రాయలసీమ గ్రామీణ బ్యాంకు, ఉస్మానియా డిగ్రీ కళాశాల, కేవీ సుబ్బారెడ్డిలకు వెండి పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 43 మందికి మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈవో మస్తాన్‌వలీ, కర్నూలు ఆర్‌డీవో హుసేన్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు