రీటా.. హ్యాట్సాఫ్‌!

24 Jul, 2016 21:06 IST|Sakshi
రీటా.. హ్యాట్సాఫ్‌!

రీటా.. హ్యాట్సాఫ్‌!

– 11 ఏళ్లు సేవలందించిన పోలీసు జాగిలం
– ఘనంగా రిటైర్డ్‌మెంట్‌ ఫంక్షన్‌
చిత్తూరు (అర్బన్‌) : ఇక్కడ రిటైర్డ్‌మెంట్‌ ఫంక్షన్‌ జరుపుకుంటున్న ఈ జాగిలం పేరు రీటా. జిల్లా పోలీసుశాఖలో ఎన్నో కేసులను ఛేదించేందుకు సహకరించింది. 2005లో జన్మించిన రీటా గ్రేహండ్స్‌ యూనిట్‌లో 2009 వరకు సేవలు అందించింది. 2009 నుంచి 2016 వరకు జిల్లాలో డాగ్‌స్వా్కడ్‌ బృందంలో ఉంది. 11 ఏళ్లపాటు అనేక కేసుల పరిష్కారానికి తోడ్పడింది. ఆదివారం ఈ జాగిలానికి వీడ్కోలుసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు దీని సేవలను గుర్తుచేసుకున్నారు. అలాగే రీటా సంరక్షకుడిగా ఉన్న శ్రీహరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐ సుజుద్దిన్, జిల్లా డాగ్‌ స్క్వాడ్‌ , క్లూస్‌ టీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు