కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీ్దకరించాలి

3 Jan, 2017 03:05 IST|Sakshi
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీ్దకరించాలి

కరీంనగర్‌సిటీ : కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వా, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె.నగేష్‌ డిమాండ్‌ చేశారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు నిరవధిక సమ్మెలో భాగంగా  కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్ష సోమవారం 5వ రోజుకు చేరింది. దీక్షాశిబిరాన్ని విశ్వా, డాక్టర్, నగేశ్, జిల్లా మా జీ అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్‌ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్‌ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వారిని రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మా జీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సందర్శించి మద్ద తు పలికారు. గతంలో కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌పై హామీ ఇచ్చిన వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశార ని విమర్శించారు.

తెలంగాణ వస్తే కాంట్రాక్ట్‌ వ్యవస్థ రద్దు చేస్తామన్న కేసీఆర్‌ నేడు ముఖం చాటేశారని, కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లు సాధించుకునేంత వరకు ఈ పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్‌ ఉన్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవేందర్, నర్సింహరాజు, నాయకులు రాజమహేందర్, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు