సబ్సిడీ విడుదల చేయాలి

19 Sep, 2016 00:56 IST|Sakshi
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : 2015–16 సంవత్సరానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు బీసీ ఫెడరేషన్‌ సబ్సిడీని విడుదల చేయాలని బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిల్లె గోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బీసీ సబ్‌ప్లాన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.2536 కోట్లు కేటాయించి తీరా ఆ డబ్బును ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తుందని ఆరోపించారు. గత సంవత్సరం కేటాయించిన రూ. 2176 కోట్లలో బీసీలకు ఎంత ఖర్చు చేసిందో బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు. 2015–16లో రాష్ట్ర వ్యాప్తంగా 1.35లక్షల మంది సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 17,500మందిని మాత్రమే ఎంపిక చేశారని అన్నారు. లబ్ధిదారులు నెలల తరబడి కార్పొరేషన్, ఫెడరేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు సబ్సిడీ విడుదల చేయలేదని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఏపి మల్లయ్య, జి.దేవేందర్, తెలుగు సత్తయ్య, బి.కృష్ణయ్య, కేశవులు, శ్రీనివాసులు, లింగమయ్య, నవీన్, సత్యం, కురుమూర్తి, నరసింహ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు