బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తికి రిమాండ్

1 Aug, 2016 18:10 IST|Sakshi

హుక్కాసెంటర్లు, కాఫీ షాపుల యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మొఘల్‌పురాకు చెందిన సొహైల్ ముబారక్ అల్ ఖసేరి(25) అనే జిమ్ ట్రైనర్‌ను బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌పరిధిలో పీడీ యాక్ట్ నమోదై ఉన్న సొహైల్ ఆరు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఖిల్లా అనే హుక్కా సెంటర్‌యజమానిని బెదిరించి ’ 2 లక్షలు ఇవ్వకపోతే కత్తితోపొడిచి చంపేస్తానంటూ భయబ్రాంతులకుగ ఉరి చేశాడు.

 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చాలా వరకు హుక్కాసెంటర్ల యజమానులను డబ్బుల కోసం బెదిరించి అంతం చేస్తానంటూ హెచ్చరిస్తుండటంతో గడగడలాడారు. ఈ నేపథ్యంలోనే ఖిల్లా హుక్కాసెంటర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సొహైల్‌పై ఐపీసీ సెక్షన్ 385,511, 507 కింద కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం సేకరించేందుకు విచారణ కోసం రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఫలక్‌నామా, భవానీనగర్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో నిందితులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు