రిమోట్‌ ఫ్లైట్‌

4 Aug, 2016 21:34 IST|Sakshi
విమాన పనితీరును వివరిస్తున్న కార్తీక్‌రెడ్డి
  • మానవరహిత విమాన నమూనా తయారీ
  • ఘనత సాధించిన గీతం వర్సిటీలోని ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు
  • పటాన్‌చెరు: గీతం యూనివర్సిటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే మానవ రహిత నమూనా విమానాన్ని(యూఏవీ) రూపొందించారు. గురువారం జరిగిన ‘బేసిక్‌ ఏరో మోడలింగ్‌’పై ఒకరోజు వర్క్‌షాప్‌లో స్కై క్లబ్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ రోబోటిక్స్‌(ఎస్‌సీఏఆర్‌) డైరెక్టర్‌ కెప్టెన్‌ కార్తీక్‌రెడ్డి రిసోర్స్‌ పర్సన్‌గా పాల్గొన్నారు.

    విమాన రూపకల్పన, రిమోట్‌ కంట్రోల్ వినియోగాన్ని వివరించారు. విమానంలో ఒక్కో విడిభాగాన్ని ఒక్కో విద్యార్థి బృందం రూపొందించడం విశేషం. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఇస్తున్న ప్రాధాన్యం, సమకూర్చుకున్న అత్యాధునిక ల్యాబొరేటరీలు, ఇతర వనరుల గురించి కెప్టెన్‌ కార్తీక్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు.

    కార్యశాల ప్రారంభోత్సవానికి గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సంజయ్‌, అధ్యక్షత వహించగా ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎన్వీ స్వామినాయుడు, ప్రొఫెసర్‌ సుశీల్‌కుమార్‌.. స్వైన్‌, వర్క్‌షాప్‌ సమన్వయకర్త డాక్టర్‌ వైడీ ద్వివేది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు