ఇద్దరు మంత్రులను తొలగించాలి

21 Sep, 2016 00:30 IST|Sakshi
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు కోరలు చాస్తుంటే ప్రభుత్వ పెద్దలు చోద్యం చూస్తున్నారని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.
 
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకటరమణ రావాలంటూ డీఎంఅండ్హెచ్ఓ కార్యలయం ముందు ధర్నా నిర్వహించిన నేతలు ఎంతకీ అధికారి కిందకు రాకపోవడంతో నేతలు, కార్యకర్తలు అధికారి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ముక్కు పచ్చలారని చిన్నారుల జీవితాలతో ఆరోగ్యశాఖా మాత్యులు, మునిపాలిటీ శాఖా మాత్యులు చెలగాటం ఆడుతున్నారని దుయ్య బట్టారు.  
 
తక్షణం ఈ నిర్లక్ష్యానికి కారకులైన మంత్రులు కామినేని, నారాయణలను తక్షణం మంత్రి పదవులనుంచి తొలగించాలని డిమాండ్చేశారు.  అనంతరం డీఎం అండ్ హెచ్ఓని ఘెరావ్ చేశారు. ఛాంబర్లోకి ఎవరు రాకుండా కార్యాలయంలో ఉన్న వారు బయటకు పోకుండా నిర్భందించారు.  వైద్యాధికారి స్పందించలేదంటూ  ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. చివరకు టూటౌన్పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళనను విరమించారు. 
మరిన్ని వార్తలు